IUI

IUI ట్రీట్‌మెంట్ పూర్తి గైడ్: స్టెప్-బై-స్టెప్ ప్రక్రియ, ఖర్చు & విజయ వాస్తవాలు

సంతాన సమస్యలను ఎదుర్కొంటున్న జంటలకు IUI ఒక సాధారణ, తక్కువ ఖర్చుతో (IUI Treatment Cost in India) కూడుకున్న, మరియు మొదటి దశలో ప్రయత్నించే ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్. IVF లేదా ఇతర ఆధునిక చికిత్సలతో పోలిస్తే IUI ప్రక్రియ సులభం, తక్కువ ఇన్వాసివ్, మరియు శారీరకంగా కూడా అంత కష్టంగా ఉండదు.

డాక్టర్‌ సలహాతో సరైన సమయానికి గర్భాశయంలో నేరుగా స్పెర్మ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా గర్భధారణ అవకాశాలను పెంచడం IUI ముఖ్య ఉద్దేశ్యం.

స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అఫ్ IUI

IUI (IUI Treatment Cost in India) ప్రక్రియలో ప్రధానంగా ఈ దశలు ఉంటాయి:

1) ఒవ్వ్యూ లేషన్ మానిటరింగ్  (అండోత్పత్తి పర్యవేక్షణ):

డాక్టర్ అల్ట్రాసౌండ్ మరియు హార్మోన్ టెస్టుల ద్వారా మహిళ అండోత్పత్తి దశను పర్యవేక్షిస్తారు. అవసరమైతే హార్మోన్ల మందులు ఇవ్వబడతాయి, తద్వారా ఒకటి లేదా రెండు ఆరోగ్యకరమైన అండాలు విడుదల అవుతాయి.

2) స్పెర్మ్ కలెక్షన్:

భర్త లేదా డోనర్ స్పెర్మ్ సేకరించబడుతుంది. ఈ స్పెర్మ్‌ను ప్రత్యేక ల్యాబ్ టెక్నిక్‌లతో శుద్ధి చేసి, అత్యుత్తమమైన స్పెర్మ్ కణాలను మాత్రమే ఎంపిక చేస్తారు.

3) ఇంసెమినషన్ (స్పెర్మ్ ప్రవేశపెట్టడం):

ఒవ్యూలేషన్ సమయానికి దగ్గరగా, ఒక చిన్న కాథెటర్ (సన్నని ట్యూబ్) ద్వారా స్పెర్మ్ నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఈ ప్రక్రియ నొప్పి లేకుండా, కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.

4) పోస్ట్ -ప్రొసీజర్రెస్ట్ (ప్రక్రియ తర్వాత విశ్రాంతి):

మహిళ 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ సూచనల ప్రకారం కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి.

IUI ఖర్చు ఎంత అవుతుంది?

IUI (IUI Treatment Cost in India) ఖర్చు IVFతో పోలిస్తే చాలా తక్కువ. భారతదేశంలో సగటు ఖర్చు: ప్రతి సైకిల్‌కు ₹10,000 నుండి ₹20,000 వరకు ఉంటుంది.

ఈ ఖర్చులో సాధారణంగా ఉండేవి:

  • కన్సల్టేషన్ ఫీజు
  • హార్మోన్ టెస్టులు & స్కాన్లు
  • స్పెర్మ్ వాష్ & ప్రాసెసింగ్
  • ఇన్సెమినేషన్ ప్రొసీజర్

గమనిక: మందులు , అదనపు టెస్టులు లేదా ఫ్రీజ్ చేసిన స్పెర్మ్ వాడితే ఖర్చు కొంచెం పెరగవచ్చు.

ముగింపు

IUI అనేది సంతాన సమస్యలకు సాధారణమైన, భద్రమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం. PCOS, అండోత్పత్తి సమస్యలు, లేదా తక్కువ స్పెర్మ్ మోటిలిటీ ఉన్న జంటలకు ఇది మొదటి దశలో సూచించబడుతుంది. IVF వంటి అధునాతన చికిత్సలలోకి వెళ్లే ముందు, IUI (IUI Treatment Cost in India) చాలా జంటలకు సహజమైన మరియు సరసమైన ప్రయత్నం అవుతుంది.

FAQ’s

1) IUI విజయశాతం ఎంత ఉంటుంది?

A: సాధారణంగా 10–20% విజయశాతం ఉంటుంది. వయసు, ఆరోగ్యం, మరియు సంతానలేమి కారణాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

2) IUI నొప్పిగా ఉంటుందా?

A: లేదు. ఇది సులభమైన మరియు దాదాపు నొప్పిలేని ప్రక్రియ. కేవలం కొంత అసౌకర్యం మాత్రమే అనిపించవచ్చు.

3) ఎన్ని సైకిళ్ల తర్వాత IVF గురించి ఆలోచించాలి?

A: సాధారణంగా 3–6 IUI సైకిళ్ల తర్వాత ఫలితం రాకపోతే, IVF లేదా ఇతర ట్రీట్‌మెంట్స్‌పై ఆలోచించమని డాక్టర్లు సూచిస్తారు.

4) IUI ద్వారా ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?

A: PCOS ఉన్న మహిళలు, సర్వికల్ మ్యూకస్ సమస్యలు, తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా మోటిలిటీ ఉన్న జంటలు, అలాగే అజ్ఞాత సంతానలేమి ఉన్నవారు IUI ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

5) IUI విజయానికి ఏవైనా జీవనశైలి మార్పులు అవసరమా?

A: అవును. ఆరోగ్యకరమైన ఆహారం, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, పొగ త్రాగడం & మద్యపానం తగ్గించడం విజయావకాశాలను పెంచుతాయి.

Comments are closed.

Next Article:

0 %
Get Free First Consultation