Fertility FoodIVF

IVF చికిత్స సమయంలో తినడానికి ఉత్తమ ఆహారాలు – పూర్తి గైడ్

IVF (In Vitro  Fertilization) అనేది చాలా జంటలు ఆశగా ఎదురుచూసే చికిత్స. ఈ సమయంలో శరీరాన్ని హార్మోనల్‌గా, మానసికంగా సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. IVF విజయవంతం కావడానికి డాక్టర్ల సూచనలు, మందులు ఎంత ముఖ్యమో, సరైన ఆహారపు (IVF Diet Plan) అలవాట్లు కూడా అంతే ముఖ్యం. శరీరానికి సరైన పోషకాలు అందించటం వల్ల ఎగ్  క్వాలిటీ మరియు  యూటీరిన్  హెల్త్  మెరుగుపడతాయి.

కాబట్టి IVF చికిత్సలో ఉన్నప్పుడు తినడానికి ఉత్తమమైన ఆహారాలు, నివారించాల్సిన ఆహారాలు, మరియు సాధారణ ఆహార సూచనల గురించి తెలుసుకుందాం.

IVF సమయంలో తినదగిన ఉత్తమ ఆహారాలు

1) తాజా కూరగాయలు మరియు పచ్చి కూరలు

పాలకూర, గోంగూర, కాబేజీ, బ్రోకలీ, బీట్రూట్, క్యారెట్ వంటి కూరగాయలు ఐరన్, ఫోలిక్ ఆమ్లం, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ఎగ్  ఆరోగ్యం మరియు గర్భాశయానికి రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి (IVF Diet Plan).

2) తాజా పండ్లు

దానిమ్మ, సీతాఫలం, ఆపిల్, మామిడి, కమలపండు, బొప్పాయి (పచ్చిగా కాకుండా పండిన బొప్పాయి), అరటి పండు లాంటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అధికంగా కలిగి ఉంటాయి.

IVF (IVF Diet Plan) సమయంలో శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. పండ్లు ఈ సమస్యను తగ్గిస్తాయి.

3) ప్రోటీన్ ఆహారాలు

పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చికెన్ (సిద్ధమయిన రూపంలో), చేపలు వంటి ప్రోటీన్‌ ఫుడ్‌లు తీసుకోవడం వల్ల ఎగ్ క్వాలిటీ  మెరుగుపడుతుంది. వెజిటేరియన్స్‌ కోసం పప్పులు, శనగలు, కంది పప్పు, సోయా బీన్స్‌ చాలా మంచివి.

 5) గింజలు మరియు విత్తనాలు

బాదం, ఆక్రోట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, సూర్యకాంతి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్‌ వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భాశయంలో ఇంప్లాంటేషన్‌ ప్రక్రియ (Embryo attachment) కు సహాయపడతాయి.

 5) హోల్గ్రేయిన్స్

బియ్యం, రాగి, జొన్న, ఓట్స్, బార్లీ వంటి ఆహారాలు విటమిన్-B, మాగ్నీషియం ఎక్కువగా ఇస్తాయి. ఇవి హార్మోన్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

6) హెల్తి ఫ్యాట్స్

ఆలివ్ ఆయిల్, అవకాడో, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఉపయోగించడం మంచిది. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి హార్మోన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయి.

7) తగినంత నీరు

IVF సమయంలో ఎక్కువగా నీరు తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్ళి, గర్భాశయానికి సరైన రక్తప్రసరణ జరుగుతుంది.

IVF సమయంలో నివారించాల్సిన ఆహారాలు

  • జంక్ ఫుడ్ (పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్)
  • అధిక కాఫీ/టీ
  •  ఆల్కహాల్
  • అధికంగా మసాలా మరియు వేయించిన పదార్థాలు
  • పచ్చి బొప్పాయి, అనాస పండు (ప్రమాదకరమైన ఎంజైమ్‌లు ఉండటం వల్ల)

IVF సమయంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు

  • రోజుకు 5–6 చిన్న ఆహారాలు తినాలి (భారీ భోజనం చేయకుండా).
  • ఒకే రకం ఆహారం కాకుండా విభిన్న పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.
  • ఒత్తిడి లేకుండా నిద్రపోవాలి, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.

IVF చికిత్సలో ఆహారం ప్రాధాన్యం

  • సరైన ఆహారం ఎగ్ క్వాలిటీ  ను మెరుగుపరుస్తుంది.
  • గర్భాశయాన్ని ఇంప్లాంటేషన్‌కి సిద్ధం చేస్తుంది.
  • హార్మోన్ల ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది.
  • IVF సక్సెస్‌ రేటును పెంచుతుంది.
ముగింపు

IVF ఒక ఎమోషనల్ జర్నీ . ఈ సమయంలో శరీరానికి సరైన ఆహారం ఇవ్వడం ద్వారా మీ IVF ప్రయాణం విజయవంతం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. డాక్టర్ సూచనలు పాటించడం, సరైన ఆహారం (IVF Diet Plan) తీసుకోవడం, మానసికంగా సానుకూలంగా ఉండటం IVF విజయానికి కీలకం.

FAQ’s

1) IVF సమయంలో మాంసాహారం తినవచ్చా?

అవును, కానీ వేపుడు, మసాలా ఎక్కువగా ఉండకుండా చికెన్, చేపలు వండి తినవచ్చు. ఇవి ప్రోటీన్‌కు మంచి మూలం.

2) IVF సమయంలో కాఫీ/టీ తాగవచ్చా?

తక్కువ మోతాదులో (రోజుకు 1 కప్పు) తాగవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోవడం IVF ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

3) IVF లో ఉన్నప్పుడు ఉపవాసం చేయవచ్చా?

IVF సమయంలో ఉపవాసం చేయడం మంచిది కాదు. శరీరానికి సమయానికి పోషకాలు అందడం చాలా ముఖ్యం.

4) IVF సమయంలో డ్రై ఫ్రూట్స్‌ ఎంత వరకు తినాలి?

రోజుకు 4–5 బాదం, 2 ఆక్రోట్స్, కొద్దిగా గుమ్మడి గింజలు తినడం సరిపోతుంది. అధికంగా తింటే బరువు పెరగవచ్చు.

5) IVF లో పాలు, పెరుగు తినడం బాగుంటుందా?

అవును, తక్కువ కొవ్వు (Low fat) పాలు, పెరుగు తీసుకోవచ్చు. ఇవి ప్రోటీన్ మరియు కాల్షియం ఇస్తాయి.

6) IVF లో నీటిని ఎంత తాగాలి?

రోజుకు కనీసం 2.5–3 లీటర్లు నీరు తాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

Comments are closed.

Next Article:

0 %
Get Free First Consultation